NZ VS WI: అదరగొట్టిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ కైవసం
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:40 AM
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తుచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్(New Zealand vs West Indies) చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తుచేసింది. దీంతో 3-0తో వన్డే సిరీస్(NZ clean sweep) ను చేజిక్కించుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది.
ఇక విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్ (51 బంతుల్లో 38 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలానే జాన్ క్యాంప్‌బెల్ (26), ఖారీ పియర్ (22*) కూడా రాణించడంతో విండీస్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. కెప్టెన్ షాయ్ హోప్ (16), అకీమ్ అగస్ట్ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్ (19), జస్టిన్ గ్రేవ్స్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ(Matt Henry) 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం 162 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్క్ చాప్‌మన్ (63 బంతుల్లో 64 పరుగులు) అర్ధ సెంచరీతో సత్తాచాటగా... మిచెల్ బ్రాస్‌వెల్(Bracewell ) (31 బంతుల్లో 40*) రాణించాడు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (14)తో పాటు విల్ యంగ్ (3), టామ్ లాథమ్ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును చాప్‌మన్(Mark Chapman) ఆదుకున్నాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్ సీల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ప్లేయర్లు మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కైల్ జెమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..