Rohit Sharma: వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన రోహిత్ శర్మ
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:02 PM
టీమిండియా వెటరన్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్కే పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
భారత వెటరన్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్క పాయింట్ తేడాతో కోల్పోవడం గమన్హారం. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ( Daryl Mitchell world number one)(782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేసుకు చేరుకున్నాడు. రోహిత్ (781 పాయిట్ల) రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్‌మన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న రెండో న్యూజిలాండ్ ప్లేయర్ గా డారిల్ మిచెల్ (Daryl Mitchell) నిలిచాడు. అంతకుముందు 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. కివీస్ జట్టుకు చెందిన మార్టిన్ క్రోవ్, ఆండ్రూ జోన్స్, రోజర్ ట్వోస్, నాథన్ ఆస్టిల్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్ వంటి ఆటగాళ్లు టాప్-5లో నిలిచినా వీరిలో ఒక్కరు కూడా అగ్రస్థానానికి చేరుకోలేకపోయారు. ఈ వన్డే ర్యాకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఒక్కో స్థానం మెరుగై వరుసగా 8వ, 16వ ర్యాంకులకు చేరుకున్నారు.
ఇక కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకం చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా రెండు స్థానాలు జంప్ ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఐదు నుంచి ఏడో ర్యాంకుకు పడిపోగా.. శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు మెరుగై 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ నాలుగు స్థానాలు దిగజారి 12వ ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్(Bumrah No.1 bowler)లో కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు మెరుగై 13వ ర్యాంకులో ఉన్నాడు. కల్దీప్ కెరీర్‌లో(Kuldeep Yadav career-best) బెస్ట్ ర్యాంక్ ఇదే. రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి