Share News

Bihar Deputy CMs: డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:30 PM

నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది.

Bihar Deputy CMs: డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్
Bihar, Deputy CMs

పాట్నా: నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా తిరిగి కొత్త ప్రభుత్వంలో అదే పదవుల్లో కొనసాగనున్నారు. పాట్నాలో బుధవారం ఉదయం జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారంనాడు జరిగే ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణస్వీకారంలో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా తిరిగి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేస్తారు.


జేడీయూ ఎల్పీ నేతగా నితీశ్

మరోవైపు, జేడీయూ లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీశ్ కుమార్‌ ఎన్నికయ్యారు. పాట్నాలో బుధవారం జరిగిన జేడీయూ ఎమ్మెల్యేల సమవేశంలో నితీశ్‌ను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఎన్డీయే నేతగా నితీశ్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈనెల 20న ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా, గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్‌ను నీతీశ్ కలుసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఎన్డీయే మద్దతు లేఖలను కూడా అందజేస్తారు.


ముహూర్తం ఖరారు

మరోవైపు, నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

అన్మోల్ బిష్ణోయ్‌ను డిపోర్ట్ చేసిన యూఎస్.. అరెస్టు చేసిన ఎన్ఐఏ

జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 19 , 2025 | 04:33 PM