Nadendla Manohar: 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:46 PM
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా, నవంబర్ 19: జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) పర్యటించారు. మంత్రి కొల్లు రవీంద్రతో (Minister Kollu Ravindra) కలిసి మచిలీపట్నంలో ధాన్యం సేకరణను నాదెండ్ల పరిశీలించారు. సుల్తానగరంలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును సందర్శించారు. ధాన్యం మిల్లింగ్, లోడింగ్ ను పరిశీలించి అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
4 వేల రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. 17 వేల మంది సిబ్బంది ధాన్యం కొనుగోళ్లలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. 30 వేల ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్‌ను వినియోగిస్తున్నామని.. 6.50 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల్లో నమ్మకం కలిగే విధంగా 4 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామన్నారు.
దీని వల్ల రైతులను దళారీ వ్యవస్థను కాపాడగలుగుతున్నామని వెల్లడించారు. అకాల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్
Read Latest AP News And Telugu News