BRS Cadre Feedback: వారి వల్లే పార్టీ ఓడిపోయింది.. బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:01 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కొందరి వల్లే పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 19: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ఓటమిని చవిచూసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఎన్నిక అనివార్యమవగా.. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో నిలిపింది. సెంటిమెంట్‌తో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలని భావించినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే పట్టంకట్టారు. ఫలితంగా ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఉప ఎన్నికలో ఓటమికి కారణాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బైపోల్స్‌లో ఓటమిపై కార్యకర్తల నుంచి కేటీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సొంత పార్టీ నాయకుల్లో కొందరు.. కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పలువురు కార్యకర్తలు ఆరోపించారు. సొంత పార్టీ నేతలు సరిగా పనిచేయకపోవడం వలనే బీఆర్ఎస్ ఓడిపోయిందని గులాబీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. స్థానిక నేతలు, జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఓటమికి కారణమని నేతలకు చెప్పారు.
స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలు బైపోల్స్‌ను పెద్దగా పట్టించుకోలేదని.. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎదుర్కోలేకపోవటం కూడా ఓటమికి కారణమని సమావేశంలో బీఆర్‌ఎస్ క్యాడర్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్
Read Latest Telangana News And Telugu News