CP Sudheer Babu: ఊపిరి ఆగకూడదంటే సిగరెట్లు ఆపాలి..
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:08 AM
ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
- రాచకొండ సీపీ సుధీర్ బాబు
- కామినేని ఆస్పత్రిలో సీఓపీడీపై అవగాహన
హైదరాబాద్ సిటీ: ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎక్కువ కాలం పాటు పొగతాగడం వల్ల క్రానిక్ అబ్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) వచ్చే అవకాశముందని, నయం చేయడానికి సాధ్యం కాని ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ధూమపానం మానేయాలని సూచించారు.
కామినేని ఆస్పత్రి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఓపీడీ సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే సమస్య, ఎప్పుడో సిగరెట్‌లు కాల్చి మానేశామనుకున్నా అప్పటికే నష్టం జరగి ఉండవచ్చని అన్నారు. సిగరెట్‌లు తాగేవారితోపాటు పొగ పొయ్యిల వద్ద పనిచేసేవారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. సీఓపీడీ సమస్యను వీలైనంత ముందుగా గుర్తిస్తే నష్టాన్ని కొంతవరకైనా తగ్గించే అవకాశముందని అన్నారు. సీఓపీడీని గుర్తించేందుకు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఒకటే మార్గమని, దీనికి రూ. 3వేల వరకు ఖర్చు అవుతుందని,

సీఓపీడీ డే సందర్భంగా కామినేని ఆస్పత్రిలో ఈ పరీక్ష, కన్సల్టెన్సీ రెండూ కలిపి కేవలం రూ.400 లకే ఈనెల 22 వరకు అందిస్తున్నామని, ధూమపానం అలవాటు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్‌బాబు పడ్గుల్, మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ అంజయ్య కనుసోలి, సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ శుభకర్ కంది, పల్మనాలజిస్టులు రవీంద్రనాథ్, డీఎస్ సౌజన్య, భరత్ జానపాటితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News