Home » Kollu Ravindra
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అధికారులు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.
తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్‌రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
చేసిన పాపాలకు పేర్ని నాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Machilipatnam Beach: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు.
టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మార్చేందుకు మసూల బీచ్ ఫెస్ట్ ద్వారా అడుగులు వేశామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Masula Beach Festival: మచీలిపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైరవం చిత్రం యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో రెండవ పోర్టు బందరు అని అన్నారు.
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.