Home » Nadendla Manohar
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తెనాలి మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూరి విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే పట్టణంలో రూ. 6 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో మహిళలే దాన మివ్వగా..
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండు రోజుల్లోనే 34 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయబడినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.
Nadendla Manohar: ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు.