Rishabh Pant: పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:22 PM
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 30 నుంచి రాంచీ వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సరదా వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ షూట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) అందరి దృష్టి ఆకర్షించాడు.
ఏమైందంటే..
ఇతర ప్లేయర్లలాగే పంత్ కూడా ఫొటోషూట్‌కు వచ్చాడు. ఫొటోలు తీస్తుండగా అతడి ముఖం డల్‌గా కనిపించింది. దీంతో కొంచెం బాగా నవ్వండి అని ఫొటోగ్రాఫర్ అడిగాడు. అందుకు పంత్.. ‘నిద్రలోంచి లేచి వచ్చాను. నిద్రపోతుంటే నన్ను లేపారు. అందుకే ఇలా ఉంది’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఫొటోగ్రాఫర్ సహా అక్కడున్న అందరూ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. మరోవైపు.. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, కింగ్ కోహ్లీ ఫొటోలకు తమదైన శైలిలో పోజులిచ్చారు. రోహిత్ శర్మ ఏకంగా ఫొటోగ్రాఫర్‌కే ఎలా ఫొటోలు తీయాలో సూచించడం హైలెట్ అయింది.
చాలా కీలకం..
టీమిండియా ఈ వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకంగా మారింది. ఇప్పటికే సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన భారత్.. తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుంది. ప్రధాన కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన
‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్