Share News

Smriti-Palash: ‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:37 PM

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి పూర్తిగా రద్దు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలన్నింటికీ ‘దిష్టి’ ఎమోజీతో వారిద్దరూ చెక్ పెట్టారు.

Smriti-Palash: ‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్
Smriti-Palash

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. స్మృతిని పలాశ్ మోసం చేశాడని.. వీరు పూర్తిగా పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్మృతి-పలాశ్(Smriti-Palash) దిష్టి రక్ష ఎమోజీతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఇరువురు తమ ఇన్‌స్టా బయోను అప్‌డేట్ చేశారు.


పోస్టులు కనిపించకపోవడంతో..

పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి ఇన్‌స్టా ఖాతాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశం అయింది. పలాశ్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ.. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ పోస్టు చేసిన వీడియో కూడా ఉన్నట్టుండి మాయమైంది. ఇదే వీడియోను స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ అకౌంట్లలో నుంచి తొలగించడంతో పలాశ్‌తో స్మృతికి మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో పలాశ్ మరో మహిళతో మంధానను కించపరుస్తూ చాట్ చేసినట్లు ఆరోపిస్తున్న స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యారు. దీంతో ఆ వదంతులకు బలం చేకూరింది.


పలాశ్ తల్లి స్పందన..

పలాశ్ తల్లి పెళ్లి గురించి మాట్లాడింది. ‘స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. పలాశ్.. స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు. నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది. వారిద్దరి వివాహం అతి త్వరలో జరుగుతుంది’ అని వెల్లడించారు. ఈ సమయంలో స్మృతి-పలాశ్ తమ ఇన్‌స్టా బయోను అప్‌డేట్ చేయడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!

మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Updated Date - Nov 29 , 2025 | 03:33 PM