Share News

New Zealand vs West Indies: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. ఆధిక్యంలో న్యూజిలాండ్

ABN , Publish Date - Nov 10 , 2025 | 08:50 PM

ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో విండీస్‌ విజయం సాధించింది. తరువాత రెండు వరుస మ్యాచుల్లో న్యూజిలాండ్‌ గెలిచింది. ఇక ఇవాళ జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్‌ వేదికగా నవంబర్‌ 13న జరుగనుంది.

New Zealand vs West Indies: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. ఆధిక్యంలో న్యూజిలాండ్
New Zealand vs West Indies

న్యూజిలాండ్, వెస్టిండీస్(New Zealand vs West Indies) మధ్య సోమవారం నాడు(నవంబర్ 14) జరగాల్సిన నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. నెల్సన్‌లోని సాక్స్ట్‌న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో విండీస్(West Indies) బ్యాటింగ్ కు దిగగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ​్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. చాలా సమయం వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 38 పరుగులు చేసింది. అలిక్‌ అథనాజ్‌ (21) ఔట్‌ కాగా.. ఆమిర్‌ జాంగూ (12), కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్‌ వికెట్‌ నీషమ్‌ తీశాడు.


ఐదు టీ20 మ్యాచుల సిరీస్(NZ vs WI Series 2025)లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో విండీస్‌ విజయం సాధించింది. తరువాత రెండు వరుస మ్యాచుల్లో న్యూజిలాండ్‌ గెలిచింది. ఇక ఇవాళ జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్‌ వేదికగా నవంబర్‌ 13న జరగనుంది. ఐదో టీ20లో వెస్టిండీస్ గెలిస్తే.. సిరీస్ సమం అవుతుంది. ఒక వేళ రద్దైనా, న్యూజిలాండ్ గెలిచినా.. సిరీస్ ఆ జట్టు సొంతం అవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచుల వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ తర్వాత వన్డే సిరీస్‌, ఆ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ జరగనున్నాయి. నవంబర్‌ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు, అలానే డిసెంబర్‌ 2, 10, 18 తేదీల్లో టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.


ఇవి కూడా చదవండి..

Mitchell Starc: బౌలింగ్‌లో అదరగొట్టిన మిచెల్‌ స్టార్క్‌..

Former Bangladesh Captain: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు


మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 10 , 2025 | 08:50 PM