NZ VS WI: పోరాడి ఓడిన వెస్టిండీస్
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:15 AM
కివీస్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 ఎంతో ఉత్కంఠగా సాగింది. నెల్సన్ వేదికా జరిగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్, వెస్టిండీస్(New Zealand vs West Indies) మధ్య మూడో టీ20 ఎంతో ఉత్కంఠగా సాగింది. నెల్సన్ వేదికా జరిగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్, టెయిలాండర్ బ్యాటర్ స్ప్రింగర్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో విండీస్ జట్టును విజయానికి చేరువ చేశారు.
విండీస్ విజయం ఖాయమని అందరూ భావించగా... ఊహించని షాక్ తగలింది. కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ స్ప్రింగర్, షెపర్డ్(Romario Shepherd) జోడీ 18 ఓవర్లో విడిపోయింది. 18 ఓవర్‌లో ఆఖరి బంతికి స్ప్రింగర్(20 బంతుల్లో 39 పరుగులు) ఔట్ కావడంతో న్యూజిలాండ్ వైపు మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా...జామిసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. షెపర్డ్(34 బంతుల్లో 49 పరుగులు) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఇష్ సోధి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జామిసన్(Kyle Jamieson), బ్రెస్‌వెల్, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway)(34 బంతుల్లో 56 పరుగులు) అర్ధశతకం సాధించగా.. మిచెల్(41), రవీంద్ర(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో ఫోర్డ్, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 నెల్సన్(Nelson T20 Match) వేదికగా నవంబర్ 10న(సోమవారం) జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ధోనీ రికార్డు సమం చేసిన డికాక్
ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 పరుగులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి