Share News

Hong Kong Sixes 2025: ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 పరుగులు

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:17 AM

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివార మోంగ్ కాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ లో ఆసీస్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించడంతో సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది.

Hong Kong Sixes 2025: ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 పరుగులు
Hong Kong Sixes 2025

హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes 2025) టోర్నీలో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివార మోంగ్ కాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ లో ఆసీస్ 54 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంతేకాక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) విధ్వంసం సృష్టించడంతో సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి.. ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది.


ఆసీస్ (Australia)బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. బంగ్లా బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఊచకొత కోశారు. ఆస్ట్రేలియా ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్ కేవలం 14 బంతుల్లో 8 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూపర్ సిక్సెస్ టోర్నీ రూల్స్ ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్‌డెర్మాట్‌(Ben McDermott)తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు.


ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు 20 సిక్స్‌లు బాదారు. అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా(Bangladesh) తరఫున అబు హైదర్ ఒంటరి పోరాటం చేశాడు. హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా( Australia Semifinal)తో పాకిస్తాన్‌తో తలపడనుంది.



ఇవి కూడా చదవండి:

Richa Ghosh: వన్డే ప్రపంచ కప్ విజేతకు డీఎస్పీ పదవి

Tai Tzu Ying: బ్యాడ్మింటన్‌కు చైనీస్ స్టార్ ప్లేయర్ తైజు వీడ్కోలు

Updated Date - Nov 09 , 2025 | 10:25 AM