Dhoni Record: ధోనీ రికార్డు సమం చేసిన డికాక్
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:50 AM
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్, పాకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును సమం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ ఆటగాడు ఆటను వదిలేస్తాడు కానీ ఆడటం మర్చిపోడు.. ఈ నానుడికి నిలువెత్తు ఉదాహరణ సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటర్ డికాక్(Quinton de Kock). రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్.. రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
10 సిక్సులు.. 20 ఫోర్లు!
పాకిస్తాన్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. ఫలితం అనుకూలంగా రాకపోయినా డికాక్ సూపర్ నాక్ ఆడాడు. ఈ సిరీస్‌లో అతడు 239 పరుగులు చేశాడు. 119.50 సగటుతో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డికాక్ 10 సిక్సులు, 20 ఫోర్లు బాదాడు.
ధోనీ రికార్డు సమం..
రిటైర్‌మెంట్ తర్వాత ఆడిన మొదటి వన్డే సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన డికాక్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇతడు ధోనీ(MS Dhoni) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ధోనీ ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు గెలిచాడు. ధోనీ తన కెరీర్‌లో ఆడిన 350 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌తో డికాక్ తన వన్డే కెరీర్‌లో ఏడో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అయితే డికాక్ ఈ అవార్డులను కేవలం 159 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
Richa Ghosh: వన్డే ప్రపంచ కప్ విజేతకు డీఎస్పీ పదవి
లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..