New Zealand Beat England: డారిల్ మిచెల్ విధ్వంసం.. కివీస్ ఘన విజయం
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:35 AM
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కవీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
క్రికెట్ న్యూస్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కవీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లీష్ బ్యాటర్లలో కెప్టెన్ హ్యారీ బ్రూక్(Harry Brook century)(135) ఒక్కడే విధ్వంసకర శతకంతో చెలరేగి ఆడాడు. జేమీ ఓవర్టన్(46) పర్వాలేదనిపించాడు. ఇక కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్స్క్ 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. జకోబ్ డఫ్ఫీ 55 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(Mitchell)కు ఒక వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది.
డారిల్ మిచెల్(Daryl Mitchell)(91 బంతుల్లో 78 నాటౌట్), మైఖెల్ బ్రేస్‌వెల్( 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీయగా.. లూక్ వుడ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్(England cricket) 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News