Share News

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:30 AM

ఆడపిల్లల దృష్టిలో పడటం కోసం అబ్బాయిలు ఎన్నో పాట్లు పడినట్లే.. ఆస్ట్రేలియాలో ఆడ డాల్ఫిన్లకు నచ్చడం కోసం మగ డాల్ఫిన్లు తలపై రంగురంగుల...

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

న్యూఢిల్లీ, అక్టోబరు 26: ఆడపిల్లల దృష్టిలో పడటం కోసం అబ్బాయిలు ఎన్నో పాట్లు పడినట్లే.. ఆస్ట్రేలియాలో ఆడ డాల్ఫిన్లకు నచ్చడం కోసం మగ డాల్ఫిన్లు తలపై రంగురంగుల ‘విగ్గులు, నాచు కిరీటాలను’ పెట్టుకొని వాటి వెంట తిరుగుతున్నాయి. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆస్ట్రేలియాలోని ఉత్తర తీరంలో పిల్బారా, కింబర్లీ ప్రాంతాల్లో మగ డాల్ఫిన్లు తమ తలపై సముద్రపు నాచు(సీ స్పాంజ్‌)ను అలంకారంగా పెట్టుకొని ఆడ డాల్ఫిన్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆస్ట్రేలియా జీవ వైవిధ్య సంరక్షణ, ఆకర్షణ విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త హోలీ రాడినో, ఆమె బృందం గుర్తించారు. డాల్ఫిన్లలో ఇలాంటి వింత ప్రవర్తనను మరెక్కడా తాము గమనించలేదని చెప్పారు.

Updated Date - Oct 27 , 2025 | 01:30 AM