Share News

Ind Vs SA: గంభీర్‌పై నెటిజన్స్ ఫైర్!

ABN , Publish Date - Nov 17 , 2025 | 09:21 AM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అతడి తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.

Ind Vs SA: గంభీర్‌పై నెటిజన్స్ ఫైర్!
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: ‘మేం ఇలాంటి పిచ్‌నే కోరుకున్నాం. పిచ్ దారుణంగా ఏమీ లేదు. అక్షర్, టెంబా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో రాణించారు. ఇది టర్నింగ్ వికెట్ అంటున్నారు. కానీ ఎక్కువ వికెట్లు పేసర్లే తీశారు. మేం గెలిచి ఉంటే పిచ్ గురించి ఎవ్వరూ మాట్లాడేవారు కాదు’.. ఇవి తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత్ 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. గంభీర్ వ్యాఖ్యలు, నిర్ణయాలపై క్రికెట్ మాజీల నుంచి నెటిజన్లు వరకు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.


అప్పడే అనేక ప్రశ్నలు..

తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత గంభీర్‌(Gautam Gambhir)పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ల వర్షం కురుస్తుంది. టీమిండియా(Team India) ఓటమికి ప్రధాన కారణం గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.బ్యాటింగ్ ఆర్డర్‌లో పదే పదే మార్పులు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌(Sai Sudharsan)ను జట్టులోకి తీసుకుని బెంచ్‌కే పరిమితం చేయడంపై క్రికెట్ మాజీలు కూడా విమర్శలు గుప్పించారు. ఈ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు అవసరం లేదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గతేడాది న్యూజిలాండ్‌తో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్‌లే ఎందుకు తయారు చేస్తున్నారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


అన్ని తప్పులే..

ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘షమీని తీసేశారు.. మంచి ఫామ్‌లోనే ఉన్న విరాట్, రోహిత్ శర్మను రిటైర్ అయ్యేలా చేశారు. కోచింగ్ స్టాఫ్ అంతా గంభీర్‌కు అనుకూలంగా ఉండేవారికి పెట్టుకున్నారు. సర్ఫరాజ్, శ్రేయస్ అయ్యర్‌ను ఎంపికే చేయలేదు.. ఇన్నీ చేస్తున్న గంభీర్ గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు?’ అంటూ ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టాడు. 124 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని కూడా ఛేదించలేకపోతే ఆడటం ఎందుకు? అంటూ రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

బావుమాకు సారీ చెప్పిన బుమ్రా!

భారత్‌పై పాక్ విజయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 09:49 AM