Share News

Ind Vs Pak: భారత్‌పై పాక్ విజయం

ABN , Publish Date - Nov 17 , 2025 | 07:15 AM

ఏసీసీ 2025 టోర్నీలో భారత్-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాక్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Ind Vs Pak: భారత్‌పై పాక్ విజయం
Ind Vs Pak

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీ(ACC)లో ఇండియా-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఆదివారం ఖతార్ రాజధాని దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.


టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కి దిగిన ఇండియా ఏ(India-A) 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ(45) రాణించాడు. నమన్ ధీర్(35)తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంతలోనే లాంగ్-ఆన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్యవంశీ ఔటయ్యాక.. ఇండియా ఏ బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక దశలో 101/3గా ఉన్న స్కోరు, చివరి ఏడు వికెట్లకు కేవలం 35 పరుగులు మాత్రమే జోడించి, 136 పరుగులకు ఆలౌట్ అయింది.


సెమీ ఫైనల్స్‌లో పాక్..

ఇండియా ఏ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఏ(Pakistan-A) 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశాడు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాక్ ఏ జట్టు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఇండియా-ఏ జట్టు టోర్నీలో నిలబడాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

భారత్ కొంపముంచిన ప్రయోగాలు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 07:15 AM