Virat Kohli Century: కోహ్లీ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:09 PM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ వెటరన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 103 పరుగులు) సెంచరీ బాదాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద .. 38వ ఓవర్లో మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. విరాట్ 102 బంతుల్లో 103 పరుగులతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల వద్ద జైస్వాల్(18 పరుగులు) ఔట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ .. ఆది నుంచే దూకుడుగా ఆడాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పరుగులు రాబట్టడంలో పోటీ పడ్డారు. ఈ క్రమంలో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔట్ కాగా.. విరాట్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయ్యాడు. అయితే మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో దుమ్మురేపిన విరాట్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్‌ను కొనసాగించాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ(103) మార్కును అందుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ సెంచరీ. ఈ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు విరాట్.
ఇవి కూడా చదవండి:
Toss Sets Record: టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు
Rohit Sharma World Record: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వన్డేలో తొలి ప్లేయర్‌గా