Iran lake mystery: వావ్.. ఇరాన్ సరస్సుపై అందమైన దృశ్యం.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:32 PM
అందమైన పెయింటింగ్ లాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే బ్రష్‌తో నీటిపై పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. ఇరాన్‌లోని మహర్లూ సరస్సుపై ఫ్లెమింగోల గుంపు అలాంటి అందాన్ని ఆవిష్కరించింది.
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాల సమాహారం. కళ్లకు, మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగించే ఎన్నో ప్రకృతి దృశ్యాలు అప్పడప్పుడు ఆవిష్కృతమవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ అందమైన పెయింటింగ్ లాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే బ్రష్‌తో నీటిపై పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. ఇరాన్‌లోని మహర్లూ సరస్సుపై ఫ్లెమింగోల గుంపు అలాంటి అందాన్ని ఆవిష్కరించింది (circular pattern lake Iran).
hoseiin_akbarian అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. డ్రోన్ ద్వారా ఈ అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించారు. సరస్సుపై వందలాది ఫ్లెమింగోలు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దూరం నుంచి చూస్తుంటే సరస్సు ఉపరితలంపై గులాబీ రంగు గీత గీస్తున్నట్లు అనిపిస్తోంది. వృత్తాకార నమూనాను ఏర్పరిచాయి. ఈ అందమైన దృశ్యంలో ఆల్గే కూడా కీలక పాత్ర పోషించింది. ఒక కళాకారుడు రెండు రంగులతో కాన్వాస్‌ను చిత్రించినట్లుగా అనిపిస్తోంది (circular pattern lake Iran).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (mysterious lake formation). ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. 4, 800 మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఇది ప్రకృతి కవిత, శక్తివంతమైన పెయింటింగ్' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇవి పక్షులు కావు, ఒక రకమైన దైవిక కళాకారులు', ఇది అత్యంత అందమైన పెయింటింగ్ అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..
మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..