Share News

Lion hunts buffalo: పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Nov 30 , 2025 | 03:14 PM

వన్య ప్రాణాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ సింహం, అడవి గేదెకు మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (

Lion hunts buffalo: పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..
buffalo herd rescue video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ సింహం, అడవి గేదెకు మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (buffalo herd rescue video).


@AmazingSights అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న ఒంటరి గేదెను ఓ సింహం పట్టుకుంది. గేదె నీటి నుంచి బయటకు వెళ్లకుండా సింహం దాని కాలును పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో గేదెల గుంపు అక్కడకు వచ్చింది. తమ స్నేహితుడు సింహానికి చిక్కినట్టు తెలుసుకున్న గేదెలు ముందుకు వచ్చాయి. తమ కొమ్ములతో ఆ సింహాన్ని బెదిరించాయి. దీంతో ఆ సింహం అక్కడి నుంచి పారిపోయింది (lion vs buffalo).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (wildlife video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 85 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. నిజమైన స్నేహం అంటే ఇదే అని ఒకరు కామెంట్ చేశారు. జట్టుతో ఉన్నప్పుడు ఎంతో శక్తి లభిస్తుందని ఒకరు పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

పెళ్లిలో ఇదేం పనిరా అయ్యా.. అతిథులు చిప్స్ కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి..

ఇది టెక్నాలజీ మాయ.. ఈ డివైజ్ మీ ఆకలిని పసిగట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 30 , 2025 | 03:14 PM