Rohit Sharma World Record: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వన్డేలో తొలి ప్లేయర్‌గా
ABN , Publish Date - Nov 30 , 2025 | 03:47 PM
సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ లాగేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటికే తన పేరిట అనే రికార్డులు నమోదు చేసిన హిట్ మ్యాన్.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల కొట్టిన వీరుడిగా నిలిచాడు. రాంచి వన్డేలో సౌతాఫ్రికా బౌలర్ ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్‌లో (14.1, 14.2 బంతులు) రోహిత్ రెండు వరుస సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్స్‌లున్నాయి.
ప్రేనెలన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో రోహిత్ శర్మ(Rohit Sharma).. పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) పేరిట ఉన్న అత్యధిక సిక్స్‌ల (351) రికార్డును సమం చేశాడు. అనంతరం మార్కో యాన్సన్ బౌలింగ్‌లో (19.4) బౌలింగ్‌లో అతడు అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో అఫ్రిది పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బ్రేక్(world record Break) అయింది. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల (352) వీరుడిగా రోహిత్ నిలిచాడు. సౌతాఫ్రికాతో రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగాడు.
అత్యధిక సిక్సులు కొట్టిన వీరులు వీరే..
1 రోహిత్ శర్మ(భారత్)- 352 సిక్సులు
2. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్)- 351 సిక్సులు
3. క్రిస్ గేల్(వెస్టిండీస్)-331 సిక్సులు
4. సనత్ జయసూర్య(శ్రీలంక)- 270 సిక్సులు
5. ఎంఎస్ ధోనీ(భారత్)- 229 సిక్సులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రోహిత్(Rohit Sharma)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్ ప్లేలో (10 ఓవర్లు) భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్ 2023 తర్వాత వన్డేల్లో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు ఇదే కావడం గమన్హారం. ఇక రోహిత్- కోహ్లీ(Virat Kohli) స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది. భారత్ స్కోర్161 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు.
ఇవి కూడా చదవండి:
Toss Sets Record: టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు
విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?