Ind Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:13 AM
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌటైంది. భారత్‌కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావునా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌటైంది. ఓవర్‌నైట్ 93/7 స్కోరుతో మూడో రోజును ఆటను ప్రారంభించిన ప్రొటీస్.. 153 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు టీమిండియా స్పిన్నర్లు విజృంభించగా.. మూడో రోజు పేసర్లు చెలరేగారు. సిరాజ్ రెండు ఓవర్లే వేసి కేవలం రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోర్బిన్ బాష్‌ను బుమ్రా ఔట్ చేసి బావుమా, బోష్ భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు.
బావుమా హాఫ్ సెంచరీ..
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Bavuma)(55*) హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓవైపు టీమిండియా బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టినా.. కెప్టెన్ బావుమా ఒంటరిగా నిలబడి పోరాడాడు. 136 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బోష్(25)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. రెకెల్టన్(11), ముల్డర్(11), జాన్సన్(13) మినహా మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బావుమా కెప్టెన్సీ నాక్‌తోనే టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి