Share News

After 21 Years: రెండో టెస్టు ఓటమి.. 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

ABN , Publish Date - Nov 27 , 2025 | 10:43 AM

గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఓటమి 21 ఏళ్ల ఓ పరాజయం తర్వాత ఇదే తొలిసారి కావడం గమన్హారం.

After 21 Years:  రెండో టెస్టు ఓటమి.. 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
India vs South Africa

రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత్(India vs South Africa) ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. 408 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 2-0తో ప్రొటీస్ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద ఘోర పరాజయం( India's biggest test defeat). 2004లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 342 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘోర పరాజయంగా ఉండగా.. తాజా ఫలితం ఈ చెత్త రికార్డ్‌ను అధిగమించింది. 549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది.


భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీశారు. అలానే సొంత గడ్డపై జరిగిన ఓ టెస్ట్ సిరీస్‌‌లో భారత బ్యాటర్లు సెంచరీ సాధించకపోవడం గత 29 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1995-96లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా శతకం చేయలేదు. సొంతగడ్డపై టీమిండియాకు ఇది మూడో(India test series loss) సిరీస్ క్లీన్ స్వీప్. సౌతాఫ్రికా చేతిలోనే రెండు సార్లు, న్యూజిలాండ్ చేతిలో ఒకసారి భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది.


టెస్టుల్లో టీమిండియా భారీ తేడాతో ఓటములు:

  • 408 పరుగుల దక్షిణాఫ్రికా 2025

  • 342 పరుగుల ఆస్ట్రేలియా 2004

  • 341 పరుగుల పాకిస్తాన్ 2006

  • 337 పరుగుల ఆస్ట్రేలియా 2007

  • 333 పరుగుల ఆస్ట్రేలియా2017

  • 329 పరుగుల దక్షిణాఫ్రికా1996


స్వదేశంలో భారత్ బ్యాటర్ల వ్యక్తిగత సెంచరీ లేని టెస్ట్ సిరీస్‌లు:

  • 1969/70 న్యూజిలాండ్‌

  • 1995/96 న్యూజిలాండ్‌

  • 2025/26 సౌతాఫ్రికా

భారత్ పై క్లీన్ స్వీప్ చేసిన ప్రత్యర్థి జట్టు:

  • 0-2 సౌతాఫ్రికా 2000

  • 0-3 న్యూజిలాండ్‌ 2024

  • 0-2 సౌతాఫ్రికా 2025


ఇవి కూడా చదవండి:

వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?

ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

Updated Date - Nov 27 , 2025 | 01:59 PM