2030 Commonwealth Games: అహ్మదాబాద్ అధికారికం
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:11 AM
రెండు దశాబ్దాల విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడలు భారత్‌లో జరగనున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్ దక్కించుకొంది. నెల రోజుల కిందే ఖరారైనప్పటికీ.. బుధవారం జరిగిన కామన్వెల్త్...
భారత్‌లోనే 2030 కామన్వెల్త్ క్రీడలు
ప్రకటించిన నిర్వాహకులు
గ్లాస్గో: రెండు దశాబ్దాల విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడలు భారత్‌లో జరగనున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్ దక్కించుకొంది. నెల రోజుల కిందే ఖరారైనప్పటికీ.. బుధవారం జరిగిన కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ధ్రువీకరించారు. మొత్తం 74 దేశాలకు చెందిన ప్రతినిధులు భారత ఆతిథ్యాన్ని ఆమోదించారు. 15 నుంచి 17 క్రీడాంశాలను ఈ క్రీడల్లో చేర్చనున్నట్టు కామన్వెల్త్ క్రీడల బోర్డు వెల్లడించింది.
అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, లాన్స్‌బౌల్స్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్ క్రీడలను ఇప్పటికే ఖరారు చేశామనీ.. ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టీ20 క్రికెట్, బీచ్ వాలీబాల్, సైక్లింగ్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్‌లాంటి మరికొన్ని క్రీడాంశాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. నైజీరియాకు చెందిన అబూజ నగరం కూడా ఈ క్రీడల నిర్వహణ కోసం పోటీపడింది. కానీ, ఎగ్జిక్యూటివ్ బోర్డు పెద్దలంతా అహ్మదాబాద్‌కే ఓటేశారు.
2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ పోటీపడుతున్న నేపథ్యంలో కామన్వెల్త్ హక్కులు లభించడం శుభపరిణామం. ఇక.. 2030లో కామన్వెల్త్ క్రీడలు వందేళ్లు పూర్తి చేసుకోనుండడం విశేషం. ఈ మెగా ఈవెంట్‌కు భారత్ వేదికవడం ఇది రెండోసారి. అంతకుముందు 2010లో దేశ రాజధాని ఢిల్లీలో ఈ క్రీడలు జరిగాయి. తొలి కామన్వెల్త్ గేమ్స్‌కు 1930లో కెనడా ఆతిథ్యమిచ్చింది. అహ్మదాబాద్‌కు ఆతిథ్య హక్కులు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభాకాంక్షలు తెలిపారు.
మరో రెండు ఈవెంట్లకు ప్రతిపాదన: అహ్మదాబాద్ నగరం మరో రెండు మెగా ఈవెంట్లకు కూడా వేదికయ్యే అవకాశముందని భారత అధికారులు వెల్లడించారు. 2028లో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్‌తో పాటు 2031 సీనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పల ఆతిథ్యానికి అహ్మదాబాద్ పేరును ప్రతిపాదించామన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!