Share News

Gautam Gambhir: గంభీర్‌ ఇప్పుడేమంటావ్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:14 AM

అద్భుతమేమీ జరగలేదు. అసలు రెండో టెస్ట్‌లో మన ప్రధాన బ్యాటర్ల ఆట తీరు చూస్తే అద్భుతమన్న పదమే అత్యాశ అవుతుంది! భారత టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శనను కనబరచిన...

Gautam Gambhir: గంభీర్‌ ఇప్పుడేమంటావ్‌

అద్భుతమేమీ జరగలేదు. అసలు రెండో టెస్ట్‌లో మన ప్రధాన బ్యాటర్ల ఆట తీరు చూస్తే అద్భుతమన్న పదమే అత్యాశ అవుతుంది! భారత టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శనను కనబరచిన మన ఆటగాళ్లకు అసలేమైంది. గత జూన్‌-జులైలో ఇంగ్లండ్‌ పర్యటనలో కఠినమైన సిరీ్‌సను డ్రా చేయడం ద్వారా కొత్త కెప్టెన్‌ గిల్‌ ఆధ్వర్యంలోని జట్టు శభాష్‌ అనిపించుకుంది. మరిప్పుడు పరిస్థితి ఎందుకు తారుమారైంది. ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత మన దేశంలో బలహీన వెస్టిండీ్‌సతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీ్‌సను టీమిండియా 2-0తో దక్కించుకుంది. కానీ బలమైన జట్టు ఎదురుపడేసరికి స్వదేశంలోనూ మనోళ్లు చేతులెత్తేస్తున్నారు.

గురువు బాధ్యత తీసుకుంటాడా ?

కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టాక భారత జట్టు అద్భుతాలు చేయలేదు సరికదా.. స్వదేశంలో గత నవంబరులో న్యూజిలాండ్‌ చేతిలో (0-3), ఇప్పుడు దక్షిణాఫ్రికాపై అవమానకర రీతిలో క్లీన్‌స్వీప్‌లు. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు చేతిలో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-3తో పరాజయం. అలాగే 27 ఏళ్ల తర్వాత వన్డేలలో శ్రీలంక చేతిలో టీమిండియా సిరీ్‌సను కోల్పోయింది. గతంలో కిర్‌స్టెన్‌, కుంబ్లే, రవిశాస్త్రి, ద్రవిడ్‌ల హయాంలో టీమిండియా చక్కని ఫలితాలే రాబట్టింది. నాటి కెప్టెన్‌ కోహ్లీతో కోచ్‌ కుంబ్లేకు సరిపడకపోయినా..అది జట్టు ప్రదర్శనపై మాత్రం ప్రభావం చూపలేదు. కానీ గంభీర్‌ వ్యవహార శైలి భిన్నమైనదని చెబుతారు. సీనియర్లేకాదు..జూనియర్లు కూడా అతడి తీరుపై సంతృప్తిగా లేరన్నది జట్టు వర్గాల సమాచారం. జట్టు ఎంపిక, ఆటగాళ్లను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి కిందికి మార్చడం తదితర గంభీర్‌ నిర్ణయాలపై విశ్లేషకులు ఆశ్చర్యం ప్రకటించడం పరిపాటి అయిపోయింది. ఇకపోతే..న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీ్‌సల ఓటముల తర్వాత సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, అశ్విన్‌ అనూహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. వారు ముగ్గురికీ కోచ్‌ గంభీర్‌ పొమ్మనలేక పొగబెట్టాడన్న విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపించాయి. మరి స్వదేశంలో రెండు టెస్ట్‌ సిరీ్‌సల్లో వైట్‌వా్‌షకు లోనైన నేపథ్యంలో కోచ్‌గా గంభీర్‌ బాధ్యత తీసుకోవాలి కదా! అన్న చర్చ మొదలైంది.


బ్యాటర్లు, బౌలర్ల సమష్టి వైఫల్యం..

ఈ సిరీ్‌సలో కోల్‌కతా టెస్ట్‌లో పట్టుబట్టి స్పిన్‌ వికెట్‌ తయారు చేయించుకున్న గిల్‌ సేన భంగపడింది. దాంతో గువాహటి టెస్ట్‌కు అటు బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించేలా పిచ్‌ను రూపొందించారు. మరి బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు ఎందుకు భంగపడ్డారు. ప్రత్యర్థి మిడిల్‌, టెయిలెండర్‌ బ్యాటర్లు ధారాళంగా పరుగులు చేసిన వికెట్‌పై కనీసం మన టాప్‌, మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎందుకు రాణించలేకపోయారు? నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. జట్టు ఇక్కట్లలో ఉన్నప్పుడు బాధ్యత లేకుండా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన జడేజా...రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. నితీశ్‌ కుమార్‌ తన ఎంపికకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఇక ఇటీవలి కాలంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్న సుందర్‌ సత్తా చాటబట్టి తొలి ఇన్నింగ్స్‌లో 200 స్కోరైనా సాధ్యమైంది. లేదంటే మనోళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. మొదటి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ ఎంతో ఓపికగా (134 బంతులు) ఆడిన తీరు చూస్తే మన ప్రధాన బ్యాటర్ల వైఫల్యం మరింత స్పష్టమవుతుంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

పుజారా బావమరిది ఆత్మహత్య

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!

Updated Date - Nov 27 , 2025 | 06:14 AM