Cheteshwar Pujara: పుజారా బావమరిది ఆత్మహత్య
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:40 PM
భారత మాజీ క్రికెట్ పుజారా బావమరిది బుధవారం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara ) బావమరిది జీత్ రసిఖ్ భాయ్ పబారీ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
2024 నవంబర్‌లో పబారీ(Jit Rasikh Bhai)పై అత్యాచారం ఫిర్యాదు నమోదైంది. అతడికి పెళ్లి చేసుకోవాలనుకున్న యువతే పబారీపై ఈ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత పబారీ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. గతేడాది దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం పబారీ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధానికి బలవంతం చేశాడని ఆరోపించింది. వారి నిశ్చితార్థం తర్వాత వేధింపులు కొనసాగాయని, ఆ తర్వాత అతను ఒక్కసారిగా సంబంధాన్ని తెంచుకున్నాడని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?
ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా