Share News

IND VS SA 2nd Test: వికెట్ కోసం శ్రమిస్తున్న భారత్ బౌలర్లు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:57 AM

ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ లో వికెట్ కోసం భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

IND VS SA 2nd Test: వికెట్ కోసం శ్రమిస్తున్న భారత్ బౌలర్లు
India South Africa second test 2025

గువాహటి వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు(Guwahati Test) జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. 247/6 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ద‌క్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది. రెండో రోజు టీ బ్రేక్‌ సమయానికి ప్రొటీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సెనూరన్‌ ముత్తుసామి(Muthusamy ) (65*), కైల్‌ వెరీన్‌ (45*) త‌మ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. రెండో రోజు ఆటలో వికెట్ తీసేందుకు భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ముత్తుసామి(Muthusamy), వెరీ(Verreynne) ఇద్దరూ చిక్కిన‌ప్పడుల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తున్నారు. ఏడో వికెట్‌కు 77 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఈ భాగ‌స్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు టీమిండియా బౌల‌ర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రిష‌బ్ పంత్ ఎంత‌మంది బౌల‌ర్లను మారుస్తున్నా ఆశించిన ఫ‌లితం మాత్రం ద‌క్కడం లేదు. ఈ సిరీస్ లో తొలి సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా దక్కకపోవడం ఇదే తొలిసారి.


తొలి రోజు(శనివారం) ఆట మొద‌టి సెష‌న్‌లో కూడా దక్షిణాఫ్రికా(South Africa Batters) బ్యాట‌ర్లు పై చేయి సాధించారు. అయితే సెకెండ్ సెష‌న్‌లో భారత స్పిన్నర్లు క‌మ్ బ్యాక్ ఇవ్వడంతో 6 వికెట్లు నేల కూలాయి. కుల్దీప్ మూడు వికెట్లు సాధించాడు. రెండో రోజు(ఆదివారం) కూడా అదే ఫ‌లితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి. రెండో రోజు తొలి గంటలో రెండవ కొత్త బంతితో భారత్‌కు లక్ దొరకలేదు. మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఇవాళ రెండు వికెట్లు తీసి... ఫైవ్ ఫర్ తీయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 332/6.



ఇవి కూడా చదవండి:

Smriti Mandhana: అదిరిపోయే డ్యాన్స్ చేసిన స్మృతి మంధాన (వీడియో)

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Nov 23 , 2025 | 12:03 PM