ibomma Trial: ఐబొమ్మ రవి నాలుగో రోజు విచారణలో కీలక విషయాలు!
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:43 AM
ఐ బొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. నెట్టింట్లో ఐ బొమ్మ రవి గురించి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో 4వ రోజు విచారణలో..
హైదరాబాద్, నవంబర్ 23: పెద్దఎత్తున సినిమాల పైరసీకి పాల్పడి నిర్మాతలకు వేల కోట్ల నష్టం మిగిల్చిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3వ రోజు కస్టడీలో భాగంగా ఐ బొమ్మ రవిని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను స్వయంగా విచారించారు.
అయితే, చాలా వరకూ రవి.. పోలీసులకు సహకరించకుండా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం. దీంతో ఎథికల్ హ్యాకర్‌ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు.
రవి.. నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో ఉపయోగించిన సర్వర్ ఐపీలు కూడా పోలీసులకు చిక్కలేదు. అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రవి ఇంటికి వెళ్లగానే సర్వర్ ఐపీలను ఐబొమ్మ రవి మార్చినట్టు పోలీసులు నమ్ముతున్నారు. అటు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై కూడా రవి నోరు మెదపనట్టు తెలుస్తోంది.
రవి యూఎస్బీటీ ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తూ, వాటిపై ఇవాళ్టి కస్టడీలో సమాధానాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. లావిష్ లైఫ్‌కు అలవాటు పడ్డ రవి.. ప్రతి 20రోజులకు ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నట్టు గుర్తించారు. రవి ఇచ్చిన వివరాల ప్రకారం బ్యాంక్ అకౌంట్స్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
రవి స్నేహితుడు నిఖిల్, రవి చెల్లికి మధ్య పలుమార్లు మనీ ట్రాన్సక్షన్ జరిగినట్టు పోలీస్ విచారణలో తేలింది. ఇక, ఐదు రోజుల రవి పోలీస్ కస్టడీ రేపటితో ముగియనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News