Vijayawada Maoists: మావోలను కస్టడీకి కోరుతున్న బెజవాడ పోలీసులు
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:51 AM
గత రెండు నెలలుగా ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినట్టు కనిపించినా, లోపల రీ-ఆర్గనైజేషన్ జరుగుతోందన్న నిఘా రిపోర్టులు ఆధారంగా గ్రే హౌండ్స్, ఏపీ స్పెషల్ పార్టీ, ఆక్టోపస్ బృందాలు కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. తాజా అరెస్టులతో ..
విజయవాడ, నవంబర్ 23: బెజవాడ పోలీసులకు చిక్కిన మావోయిస్టులను వారం రోజులు కస్టడీ కోరేందుకు విజయవాడ పోలీసులు సమాయత్తమవుతున్నారు. మావోల కదలికలు, తదితర సమాచారం సేకరించేందుకు, దీనిపై లోతైన విచారణ జరపటానికి పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తం 28 మంది మావోయిస్టులను 3 దఫాలుగా పోలీసులు కస్టడీ కోరనున్నారు. మొదటగా 10 మందిని కస్టడీ కోరుతూ రేపు పిటిషన్ వేయనున్నారు.
ఇలా ఉండగా, కృష్ణా జిల్లా పోలీసులు గత కొద్ది రోజులుగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో మొత్తం 28 మంది మావోయిస్టు నేతలు, క్యాడర్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో నలుగురు సీనియర్ మావో నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ఈ నలుగురి సహా మొత్తం 28 మందినీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రేపు (నవంబర్ 24) మొదటి దఫాలో మొదటి 10 మంది కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అరెస్టయిన వారిలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. వీరి ద్వారా మావోల రహస్య స్థావరాలు, ఆయుధ డంపులు, ఫైనాన్స్ ఛానెళ్లు, కొత్త రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్ గురించి లోతైన సమాచారం సేకరించాలి. ఇటీవల ఏపీ-తెలంగాణ-ఒడిషా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోల కదలికలు పెరిగాయన్న నిఘా నివేదికలు ఉన్నాయి. ఈ తరుణంలోనే పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నవంబర్ 24 (రేపు): మొదటి బ్యాచ్ – 10 మంది, నవంబర్ 26, 28 తేదీల్లో మిగతా 18 మందిని కస్టడీకి కోరబోతున్నారు. అరెస్టయిన వారిలో మహిళలు, విద్యార్థులు, మాజీ ఉద్యమకారులు కూడా ఉన్నారని, వీరంతా కృష్ణా-గుంటూరు-పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉంటూ పార్టీ పనులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News