Smriti Mandhana: అదిరిపోయే డ్యాన్స్ చేసిన స్మృతి మంధాన (వీడియో)
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:19 AM
టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సంగీత్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె, తనకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.
భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana wedding) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్2025లో లీగ్ మ్యాచ్ లో పలు మ్యాచుల్లో భారత్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అలానే ఫైనల్ మ్యాచ్ లో కూడా 45 పరుగులతో భారత్ భారీ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. నేడు స్మృతి పెళ్లి పీటలు ఎక్కనుంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఇవాళ(ఆదివారం) ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో కాబోయే దంపతులు స్మృతి, ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్(Smriti Mandhana wedding celebration) అవుతోంది.
పలాష్ ముచ్చల్ మెడలో స్మృతి(Palash Muchhal marriage) దండ వేయగా.. అతడు మంధానకు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'తేను లేకే మైన్ జావంగా' అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అందులో వీరిద్దరు వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ సైతం చేశారు. మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ సంగీత్ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై.. సందడి చేశారు. వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్ లో విజృంభించి.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ గా మారిన జెమీమా రోడ్రిగ్స్ ఈ వేడుకకు హాజరైంది.
అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి క్రికెటర్లు రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌ల(wedding dance)తో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, 'టీమ్ బ్రైడ్' (వధువు జట్టు), 'టీమ్ గ్రూమ్' (వరుడి జట్టు) మధ్య ఓ ఫన్నీ క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన 'టీమ్ బ్రైడ్' ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
NZ VS WI: అదరగొట్టిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ కైవసం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..