Ashes 2025: ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.. 148 ఏళ్లలో తొలిసారి
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:38 AM
యాషెస్ 2025 సిరీస్ లో ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన జట్టుగా నిలిచింది.
యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య(Australia vs England) తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచుల ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ట్రావిస్ హెడ్ విధ్వంసంతో ఆసీస్ అనుకున్న సమయం కంటే చాలా ముందే విజయాన్ని అందుకుంది. ఇదే సమయంలో టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన జట్టుగా నిలిచింది.
తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్(Travis Head)(83 బంతుల్లో 123 పరుగులు) టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆసీస్.. ఇంగ్లాండ్ ఖాతాలో ఉన్న ఓ రికార్డ్‌ను అధిగమించింది. గతంలో ఇంగ్లండ్ 204 పరుగుల లక్ష్యాన్ని 35.3 ఓవర్లలో అధిగమించింది. అలానే న్యూజిలాండ్ 217 పరుగుల టార్గెట్‌ను 39.4 ఓవర్లలో ఛేదించింది. ఇప్పటి వరకు ఈ జట్లే అత్యంత వేగంగా టార్గెట్ ను అందుకున్న రికార్డ్స్ ఉన్నాయి. తాజా విజయంతో ఆసీస్ వాటిని కనుమరుగు చేసింది. 205 పరుగుల లక్ష్యా్న్ని 28.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. ఆస్ట్రేలియా(Australia) గడ్డపై అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కూడా ఇదే కావడం గమన్హారం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/55)తో పాటు స్కాట్ బోలాండ్(4/33) ఇంగ్లాండ్ ను స్వల్ప స్కోర్ కే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యం( Fastest 200 chase Test cricket) నమోదైంది. ఈ టార్గెట్ ను 28.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి.. ఛేదించింది.
ఇవి కూడా చదవండి:
NZ VS WI: అదరగొట్టిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ కైవసం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..