Share News

Harmanpreet Kaur: మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!

ABN , Publish Date - Dec 03 , 2025 | 10:43 AM

జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.

Harmanpreet Kaur: మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే టీమిండియా దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ విగ్రహాలు ఉన్నాయి. అయితే హర్మన్.. ఈ జాబితాలో చేరనున్న తొలి మహిళా క్రికెటర్ కావడం విశేషం.


అందుకే..

ఈ మైనపు మ్యూజియం జైపూర్‌లోని చారిత్రాత్మక నహర్‌ఘర్ కోటలో ఉంది. నిత్యం ఇప్పటికీ ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు హర్మన్ విగ్రహం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ విషయం గురించి మ్యూజియం వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ స్పందించారు. ‘హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ మహిళా క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె దూకుడు, నాయకత్వ లక్షణాలు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. అందుకే ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

సుందర్ స్థానంలో తిలక్ వర్మ?

పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

Updated Date - Dec 03 , 2025 | 11:15 AM