Share News

Rohit Sharma: అరుదైన మైలురాయికి చేరువలో హిట్‌మ్యాన్!

ABN , Publish Date - Dec 03 , 2025 | 09:53 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులకు రోహిత్ శర్మ కేవలం 41 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఈ అరుదైన క్లబ్‌లో స్థానం దక్కించుకునే నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. హిట్‌మ్యాన్ రాయ్‌పూర్ వన్డేలో ఈ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Rohit Sharma: అరుదైన మైలురాయికి చేరువలో హిట్‌మ్యాన్!
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఈ క్లబ్‌లో ఉన్నారు.


రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్(Rohit Sharma) అదరగొట్టాడు. 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే అతడు ఈ మ్యాచులోనే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన(352) బ్యాటర్‌గా అవతరించాడు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిదీ(351) వెనక్కి నెట్టి రోహిత్ శర్మ ఈ ఫీట్ అందుకున్నాడు. రాయ్‌పుర్‌ వేదికగా ప్రారంభం కానున్న రెండో వన్డేలోనూ అతడు రాణించి.. 20,000 పరుగుల మైలురాయిని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఈ 20వేల పరుగుల జాబితాలో సచిన్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 27,808* పరుగులతో విరాట్ రెండో స్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ 24,064 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 19,959 పరుగులతో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 503 మ్యాచులు ఆడిన హిట్‌మ్యాన్.. 110 హాఫ్ సెంచరీలు, 50 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231, వన్డేల్లో 11,427 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి:

సుందర్ స్థానంలో తిలక్ వర్మ?

పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

Updated Date - Dec 03 , 2025 | 09:53 AM