Ind Vs SA: సుందర్ స్థానంలో తిలక్ వర్మ?
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:18 AM
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పుర్ వేదికగా సౌతాఫ్రికా-భారత్(Ind Vs SA) మధ్య రెండో వన్డే మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం బారిన పడటంతో అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్(Washington Sundar)ను ఆడించారు. రాంచిలో జరిగిన వన్డేలో సుందర్ విఫలమయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన అతడు.. 19 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వన్డేలో అతడిని తప్పించి తిలక్ వర్మ(Tilak Varma)ని ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తో విఫలమైనా.. బంతితో పర్వాలేదనిపించాడు. 3 ఓవర్లు పొదుపుగా బౌలింగ్ వేసిన సుందర్..18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ వికెట్లేమీ తీసుకోలేదు. మొత్తంగా రాంచీ వన్డేలో అతడు పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. అందుకే రాయ్‌పూర్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో తిలక్ వర్మను ఆడిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసే వర్మ.. స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. వాళ్లు ఔటయ్యాక మిడిల్ ఓవర్లలో టీమిండియా రన్‌రేట్ పడిపోయింది. చివర్లో కేఎల్ రాహుల్ మాత్రం వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో మిడిల్ ఆర్డర్‌లో సుందర్ స్థానంలో తిలక్ వర్మను తీసుకుంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీమిండియా జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్/తిలక్‌వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇవి కూడా చదవండి:
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ