Share News

Hardik Pandya Comeback: టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్

ABN , Publish Date - Nov 14 , 2025 | 09:06 AM

టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌కు చాలా ముందుగానే తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 Hardik Pandya Comeback: టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్
Hardik Pandya injury update

వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్(T20 World Cup 2026) జరగనుంది. తమ టైటిల్ ను నిలబెట్టుకోవాలని టీమిండియా(Team India) రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే భారత్ ఓ గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌కు చాలా ముందుగానే తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ లో గాయం కారణంతో తరువాత జరిగిన మ్యాచులకు, ఆస్ట్రేలియా టూర్ కు దూరమైన సంగతి తెలిసిందే.


ఆసియా కప్ 2025 సమయంలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) క్వాడ్రిసెప్స్ కండరాల గాయంతో జట్టుకు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌తో జరిగిన కీలక ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. ఆసియా కప్ 2025 సెమీ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడనున్నాడు. ఈ దేశీయ టీ20 టోర్నీలో పాండ్యా మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత రాబోయే దక్షిణాఫ్రికా(South Africa series)తో వన్డే, టీ20 సిరీస్‌లలో భారత జట్టులోకి తిరిగి వస్తాడు.


హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకుంటున్నాడు. నవంబర్ 26న బెంగాల్‌తో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు హార్దిక్ ఫిట్‌( Hardik Pandya fitness)గా ఉంటాడని ఓ నివేదిక తెలిపింది. ఒకవేళ ఏమైనా ఆలస్యమైతే, నవంబర్ 28న పుదుచ్చేరితో జరిగే టోర్నమెంట్ రెండో మ్యాచ్ నాటికి ఈ ఆల్‌రౌండర్ ఖచ్చితంగా యాక్షన్‌లోకి తిరిగి వస్తాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యాకు ఎటువంటి విశ్రాంతి ఉండదు. మరోవైపు హార్దిక్ పాండ్యా చివరగా ఆడిన ఆసియా కప్(Asia Cup 2025) టోర్నమెంట్ అతనికి అంతగా కలిసి రాలేదు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులు చేసి.. 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.


ఇవి కూడా చదవండి:

Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌లోకి విధ్వంస‌క‌ర ప్లేయర్

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2025 | 09:44 AM