Ruturaj Gaikwads Century: రుతురాజ్ సూపర్ సెంచరీ.. టీమిండియా ఘన విజయం
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:06 AM
రాజ్ కోట్ వేదికగా సౌతాఫ్రికా- ఏ జట్టుతో జరిగిన అనధికారిక వన్డేలో భారత్- ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.
సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-ఏ జట్టు(India vs South Africa A) ఘన విజయం సాధించింది. గురువారం రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad Century) సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల టార్గె్ట్ చేధనలో గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రుతురాజ్ తొలి వికెట్ కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
గురువార జరిగిన ఈ అనధికారిక వన్డేలో టాస్ గెలిచి.. బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా- ఏ(South Africa A) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. డెలానో పోట్‌గీటర్(88), ఫోర్‌స్టర్ (77), ఫోర్టూయిన్ (59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఇక భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిధ్, నిషాంత్, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి తలో వికెట్ తీశారు. అనంతరం 286 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్‌కు చేరినప్పటికి.. రుతురాజ్(Ruturaj Gaikwad) మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.
రుతురాజ్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి.. భారత్ స్కోర్ 219 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. రుతురాజ్(Ruturaj Gaikwad performance)తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిశాంత్ సింధు(29) రాణించారు. మరోవైపు 50 ఓవర్ల ఫార్మాట్‌లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో అభిషేక్(Abhishek Sharma) విఫలమయ్యాడు.
ఇవి కూడా చదవండి:
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి