Share News

Ban VS IRE Test: భారీ గెలుపు దిశగా బంగ్లాదేశ్

ABN , Publish Date - Nov 14 , 2025 | 07:46 AM

సిల్హెట్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

Ban VS IRE Test: భారీ గెలుపు దిశగా బంగ్లాదేశ్

సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య తొలి టెస్టు(Bangladesh vs Ireland Test) జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఐరీష్ జట్టు బంగ్లా కంటే 215 పరుగులు వెనకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌల‌ర్ల ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది.


ఐర్లాండ్(Ireland) బ్యాటర్లలో ఓపెన‌ర్ పాల్ స్టిర్లింగ్(43) కాసేపు నిలకడ‌గా ఆడాడు. బంగ్లా బౌలర్ల ధాటికి మిగతా బ్యాట‌ర్లంతా వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లగానే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. బంగ్లాదేశ్ బౌల‌ర్లలో ఇప్పటివ‌ర‌కు హసన్ మురాద్ రెండు వికెట్లు సాధించగా.. న‌హిద్ రాణా, తైజుల్ ఇస్లాం త‌లా వికెట్ పడగొట్టారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ విషయానికి వస్తే... త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 587/8 భారీ స్కోర్ వ‌ద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లా ఓపెన‌ర్‌ మహముదుల్ హసన్ జాయ్(Mahmudul Hasan Joy)(171), కెప్టెన్ న‌జ్ముల్ హోస్సేన్ షాంటో(100) సెంచరీలతో చెలరేగారు. వారికి తోడుగా షాద్‌మన్ ఇస్లామ్( 80 ), మోమినుల్ హక్(82) లు కూడా హాఫ్ సెంచ‌రీలతో రాణించడంతో బంగ్లా దేశ్ భారీ స్కోర్ చేసింది.


ఇక ఐర్లాండ్ బౌలర్లలో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ ఫైవ్ వికెట్ల హాల్‌తో స‌త్తాచాటాడు. అలానే బెర్రీ 2, ఆండీ మెక్ బ్రెన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్(Ireland batting collapse) తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (60), కేడ్‌ కార్మిచల్‌ (59) అర్ద సెంచరీలు చేశారు. కర్టిస్‌ క్యాంఫర్‌ (44), లోర్కాన్‌ టకర్‌ (41), జోర్డన్‌ నీల్‌ (30), బ్యారీ మెక్‌కార్తీ (31) ఓ మోస్తరు పరుగులతో పర్వాలేదనిపించారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాలుగో రోజు ఆటలోనే బంగ్లాదేశ్(Banladesh) గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓట‌మి నుంచి త‌ప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జ‌ర‌గాలి.


ఇవి కూడా చదవండి:

Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌లోకి విధ్వంస‌క‌ర ప్లేయర్

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2025 | 07:46 AM