Gautam Gambhir Reacts: ఢిల్లీ పేలుడు ఘటన... మృతులకు గౌతమ్ గంభీర్ సంతాపం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:43 AM
ఢిల్లీ ఘటనలో మృతి చెందిన వారికి టీమిండియా కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంతాపం తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికా పోస్ట్ పెట్టాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని అన్నాడు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని గంభీర్ తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగరంలోని ఎర్ర కోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద కారులో భారీ పేలుడు జరిగి.. 9 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ(Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఢిల్లీ ఘటనలో మృతి చెందిన వారికి టీమిండియా కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam Gambhir Reacts) సంతాపం తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికా పోస్ట్ పెట్టాడు.
ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని తెలిపాడు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని గంభీర్(Gautam Gambhir Reacts) తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. గౌతమ్ గంభీర్ భారత్ జట్టు కోచ్ పదవి చేపట్టడానికి ముందు 2019 నుంచి 2024 వరకు తూర్పు ఢిల్లీ పార్లమెంట్(East Delhi) స్థానం నుంచి ఎంపీగా కొనసాగారు.
కోల్‌కతాలో భద్రత పెంపు:
సౌతాఫ్రికా జట్టు(South Africa Team) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. నవంబర్ 14న టీమిండియా, సఫారీల మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పోలీసులు కోల్‌కతా(Kolkata)లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అలాగే భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లకు భద్రత కట్టుదిట్టం చేశారు. వారు బస చేయనున్న హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కోల్‌కతా సీపీ మనోజ్ వర్మ ఇవాళ (మంగళవారం) ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు. అలానే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధికారులు, పోలీసులు భద్రత ఏర్పాట్ల విషయమై అధికారులతో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..