Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:50 AM
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ నివాసంపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి మెయిన్ గేట్, కిటికీలు ధ్వంసమయ్యాయి.
పాకిస్థాన్‌లో తరచూ ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు, పేలుడు ఘటనలు చోటుచేసుకుంటాయి. అలానే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖలపై కూడా దాడులు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ నషీమ్ షా(Naseem Shah)ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ నివాసం(firing near Naseem Shah house)పై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి మెయిన్ గేట్, కిటికీలు ధ్వంసమయ్యాయి. అలానే ఇంటి ముందు పార్క్ చేసిన కారు కూడా బాగా డ్యామేజ్ అయింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఈ కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను చూసినట్లు అయితే.. నసీమ్ షా(Naseem Shah) ఇంటి ప్రధాన గేటు ద్వారంపై బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. దీనిపై సమాచార అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ కాల్పులు ఘటనకు సంబంధించి మయార్ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో నసీమ్ షా(Naseem Shah) నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa)లో కాల్పుల సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఎక్కువగా పెరిగిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక నషీమ్ షా క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు బిజీగా ఉన్నాడు. త్వరలో శ్రీలంక(Srilanka)తో జరగనున్న తొలి వన్డేకు షా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నషీమ్ షా(Naseem Shah) కాల్పుల ఘటనతో ఇతర పాక్ క్రికెటర్లకు కూడా పోలీసులు భద్రత పెంచారు.
ఇవి కూడా చదవండి..
Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Former Bangladesh Captain: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు
మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..