Heavy Rains: 16 నుంచి మళ్లీ ఉగ్ర ‘ఈశాన్యం’
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:33 AM
వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
- వరుస అల్పపీడనాల ప్రభావం
చెన్నై: వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నటున్ల వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైరుతి పవనాలు బలహీనపడుతున్న సమయంలో, ఈశాన్య రుతుపవనాల రాకతో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ‘మొంథా’ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది.
ఈ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చుతాయని భావించగా, దానికి విరుద్ధంగా కొద్దిరోజులుగా వర్షాలు లేకుండా పోయాయి. అంతేగాక ఎండ తీవ్రత పెరిగింది. ఈ నెలాఖరు వరకు వర్షాలు ఆశించినంతగా కురిసే అవకాశం లేదని నిపుణులు భావించారు. ఈ నేపథ్యంలో, చెన్నై సహా తీర ప్రాంతాల జిల్లాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ప్రకారం, శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడి, ఈ నెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చవచ్చని అంచనా వేసింది.
ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో బుధవారం నుంచి ఈ నెల 15వ తేది వరకు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముంది. ఆ ప్రకారం, ఈ నెల 12న తంజావూరు, పుదుకోట, రామనాధపురం(Thanjavur, Pudukkottai, Ramanathapuram), విరుదునగర్, తూత్తుకుడి, తిరునల్వేలి,

కన్నియాకుమారి, నీలగిరి, కోవై, తిరుపత్తూర్, తేని, తెన్‌కాశి జిల్లాలు, 13న కోవై, నీలగిరి, దిండుగల్, తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీవర్షం కురిసే అవకాశముంది. 14,15 తేదీల్లో రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా మారి, రాత్రిపూట, తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News