Share News

Jubilee Hills By Poll: ఓటు వేశాక కాంగ్రెస్ అభ్యర్థి చెప్పిన మాటలివే..

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:58 AM

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Jubilee Hills By Poll: ఓటు వేశాక కాంగ్రెస్ అభ్యర్థి చెప్పిన మాటలివే..
Jubilee Hills By Poll

హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాసర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 217 కేంద్రంలో నవీన్ యాదవ్ ఓటు వేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓటు హక్కును వినియోగించుకున్నారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 45 శాతం ఓట్లు నమోదయ్యాయని.. ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రంలోపు 65% ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు బాగా చేశారని కొనియాడారు. స్వచ్ఛంధంగా ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా జనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసే వ్యాఖ్యలు అర్థలేనివి అని కొట్టిపారేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోరారు.


కాగా.. ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఘటనకు జరుగకుండా భద్రతను కల్పించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.


ఇవి కూడా చదవండి...

మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం

భయపెడుతున్న వీధి కుక్కలు..నెల రోజుల్లో 758 కేసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 11:12 AM