Chennai News: ప్రైవేటు ఉద్యోగి దారుణహత్య
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:11 AM
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. భీమానగర్ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్ (27) అనే యువకుడికి యేడాది క్రితం వివాహం జరిగింది. ఆ యువకుడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగొస్తుంటాడు.
చెన్నై: తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. భీమానగర్ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్ (27) అనే యువకుడికి యేడాది క్రితం వివాహం జరిగింది. ఆ యువకుడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగొస్తుంటాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎప్పటిలాగే తామరై సెల్వన్ బైకులో ఆఫీసుకు బయలుదేరాడు. పాత పోస్టాఫీస్ రహదారిలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుగా బైకుపె వచ్చి తామరై సెల్వన్ బైక్‌ను ఢీకొట్టారు.

దీంతో బైకు మీది నుంచి తామరై సెల్వన్ రోడ్డుపై పడటంతో ఆ వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులతో అతడిపై దాడి జరిపేందుకు ప్రయత్నించగా, తామరై సెల్వన్ పరుగెత్తుకెళ్ళి థిల్లైనగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో ఏఎ్‌సఐ సెల్వరాజ్ ఇంటిలోపల దాక్కునేందుకు వెళ్ళాడు. ఆ దుండుగులు అతడిని వెంబడిస్తూ ఇంటిలోపలకు చొరబడి తామరై సెల్వన్‌ను ఏఎస్ఐ సెల్వరాజ్, అతడి కుటుంబీకులు చూస్తుండగా వేటకొడవళ్లతో, కత్తులో నరికి దారుణంగా హతమార్చారు. దీంతో క్వార్టర్స్‌లో నివసిస్తున్న పోలీసులు కుటుంబాలు భయంతో పరుగులు తీశారు.

హంతకులు పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు పోలీసు కుటుంబీకులు ప్రయత్నించాయి. అయినా ఫలితం లేకపోయింది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి తామరై సెల్వన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్య తిరుచ్చిలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బసచేసిన ప్రాంతానికి సుమారు రెండు కిలోమీటర్లలో జరగటం తీవ్ర కలకలం సృష్టించింది. ఇదిలా ఉండగా సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News