Share News

Kohli-Ishant: కోహ్లీ ఆకలి బాధల గురించి తెలుసా? ఇషాంత్ ఎమోషనల్ కామెంట్స్!

ABN , Publish Date - May 18 , 2025 | 03:15 PM

టాప్ బ్యాటర్ కోహ్లీ చిన్నతనంలో పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ. రూపాయి రూపాయి దాస్తూ విరాట్ పడిన బాధలను అతడు పంచుకున్నాడు. మరి.. ఇషాంత్ ఇంకా ఏమేం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kohli-Ishant: కోహ్లీ ఆకలి బాధల గురించి తెలుసా? ఇషాంత్ ఎమోషనల్ కామెంట్స్!
Virat Kohli

విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెబితే క్రికెట్ ప్రపంచం ఊగిపోతుంది. దశాబ్దంన్నర నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తూ వస్తున్నాడీ ఢిల్లీ కెరటం. హస్తినలో గల్లీ క్రికెట్ ఆడుతూ ఎదిగిన విరాట్.. ఆ తర్వాత కాలంలో ఏకంగా ప్రపంచ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ ఎవరికీ అందని స్థాయికి చేరుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతూ, అలాగే అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో నటిస్తూ, హోటల్-క్లోతింగ్ బిజినెస్ నడుపుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. అతడు తలచుకున్న వస్తువు క్షణాల్లో కళ్ల ముందు వాలాల్సిందే. అయితే ఈ రేంజ్‌లో ఉన్న కోహ్లీ.. ఒకప్పుడు ఆకలి కష్టాలు చూశాడట. తిండి కోసం రూపాయి రూపాయి దాచుకున్నాడట. ఈ విషయాన్ని భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బయటపెట్టాడు. ఇంతకీ లంబూ ఏమన్నాడంటే..


మన లాంటోడే: ఇషాంత్

విరాట్ కోహ్లీ అందరికీ స్టార్. కానీ నాకు మాత్రం చీకూ (కోహ్లీ ముద్దుపేరు)నే. బయటివాళ్లకు అతడో స్టార్. కానీ నేను అలా చూడను. ఎందుకంటే అండర్-17 నుంచి అతడితో కలసి ఆడుతున్నా. అతడు నా చిన్నప్పటి స్నేహితుడు. అండర్-19 ఆడుతున్నప్పుడు మా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయా అని పదే పదే లెక్కబెట్టేవాళ్లం. ఎంత మనీ ఉందో దాన్ని బట్టే తినేవాళ్లం. అండర్-19 మ్యాచులు ఆడటం ద్వారా వచ్చిన టీఏ డబ్బుల్ని దాచుకునేవాళ్లం. అందరికీ తెలిసిన కోహ్లీ వేరు, నాకు తెలిసిన నా మిత్రుడు విరాట్ వేరు. అతడు నాకు సోదరుడి లాంటోడు. ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. అందరూ అతడ్ని గొప్పోడిలా చూస్తున్నారు. కానీ వాస్తవానికి కోహ్లీ కూడా మన లాంటి మామూలు మనిషే. ఈ రేంజ్‌‌కు చేరుకునేందుకు విరాట్ ఎంతగా శ్రమించాడో అర్థం చేసుకోవాలి.. అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

భారతరత్న.. కోహ్లీ-రోహిత్ ఫ్యాన్స్ రచ్చ

శ్రీవారి సేవలో గంభీర్

కెప్టెన్‌గా గిల్‌ ఖాయమేనా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 03:26 PM