Share News

Champions Trophy 2025: ఇంత చీప్ మెంటాలిటీనా.. పాక్‌పై టీమిండియా స్టార్ తండ్రి సీరియస్

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:33 PM

Virat Kohli: గత కొన్నాళ్లుగా పూర్ ఫామ్‌తో సతమతమవుతున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గాడిన పడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు స్టన్నింగ్ సెంచరీతో అదరగొట్టాడు.

Champions Trophy 2025: ఇంత చీప్ మెంటాలిటీనా.. పాక్‌పై టీమిండియా స్టార్ తండ్రి సీరియస్
Champions Trophy 2025

టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తరచూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఏ విషయం మీదైనా తాను అనుకున్నది చెప్పడం, భయపడకుండా కామెంట్ చేయడం, నిలదీయడం ఆయన స్టైల్. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి మళ్లీ దుమారం రేపాడు యోగ్‌రాజ్. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటనపై యువీ తండ్రి సీరియస్ అయ్యాడు. ఇంత చీప్ మెంటాలిటీ ఏంటంటూ పాక్ ప్లేయర్‌పై ఫైర్ అయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో షాహిన్ అఫ్రిదీ వ్యవహరించిన తీరు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు యోగ్‌రాజ్.


దమ్ముంటే ఔట్ చేయాలె

పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా పరుగులు చేయడంలో సతమతమవుతున్న కింగ్.. కీలకమైన దాయాదితో పోరుతో టచ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో 111 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాక్ సంధించిన 241 పరుగుల టార్గెట్‌ను అందుకోవడంలో కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. అయితే ఓ సమయంలో విరాట్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం కష్టమని అంతా అనుకున్నారు. గెలుపు కోసం చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటం, పాక్ బౌలర్లు పదే పదే వైడ్లు వేయడంతో విరాట్ మూడంకెల మార్క్ అందుకోకపోవచ్చని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు అతడు శతకంతో మ్యాచ్‌ను ముగించాడు. తాజాగా ఇదే విషయంపై యోగ్‌రాజ్ రియాక్ట్ అయ్యాడు. కావాలని వైడ్లు వేసిన పేసర్ షాహిన్ అఫ్రిదీపై ఆయన సీరియస్ అయ్యాడు. అతడిది చీప్ మెంటాలిటీ అంటూ ఏకిపారేశాడు.


ఔట్ చేయడం చేతగాక..

‘భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు చెండాలంగా ఉంది. శుబ్‌మన్ గిల్‌ ఔట్ అయ్యాక అబ్రార్ అహ్మద్ రియాక్ట్ అయిన తీరు అస్సలు బాగోలేదు. అక్కడితో వాళ్లు ఆగలేదు. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువైన సమయంలో అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దమ్ముంటే మంచి బంతులు వేసి అతడ్ని ఔట్ చేయాల్సింది. అది చేతగాకపోవడంతో షాహిన్ అఫ్రిదీ పదే పదే వైడ్లు వేశాడు. ఇది నిజంగా చీప్ మెంటాలిటీ. ప్రొఫెషనల్ ప్లేయర్లు ఇలాగేనా వ్యవహరించేది.. గెలుపోటములతో సంబంధం లేకుండా బరిలోకి దిగాక ఏ ఆటగాడైనా సింహంలా ఓ చాంపియన్ మాదిరిగా ఆడాలి’ అని యోగ్‌రాజ్ స్పష్టం చేశాడు.


ఇవీ చదవండి:

సెమీస్ చేరాలంటే సంచలనం జరగాలి

ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 03:12 PM