Kohli-Gill Captaincy: కోహ్లీ-గిల్ ఒకే మాట.. ఈ నిజం తెలిస్తే గూస్‌బంప్స్ పక్కా!
ABN , Publish Date - Jul 08 , 2025 | 02:29 PM
కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్‌బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో టీమిండియాకు నూతన సారథిగా ఎంపికైన గిల్.. విరాట్‌లాగే మరింత బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రీజులో పాతుకుపోవడం, ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడం, చివరి వరకు పోరాడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ సెంచరీలు, డబుల్ సెంచరీతో దుమ్మురేపుతున్నాడు శుబ్‌మన్. అయితే కెప్టెన్సీలో మాత్రం తనదైన పంథాలో కూల్‌గా టీమ్‌ను నడిపిస్తున్నాడు. కానీ సారథ్యంలోనూ వీళ్లది ఒకే రూటు, ఒకే మాట అని వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ బయటపెట్టాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
కెప్టెన్సీ చాన్స్..
‘కొన్ని రోజుల కింద కోహ్లీని కలిశా. అతడు కెప్టెన్సీ గురించి చాలా సేపు మాట్లాడాడు. తాను గొప్ప టెస్ట్ ఆటగాడ్ని అని, ఆ ఫార్మాట్‌లో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని అంతా అనుకుంటారని.. అది నిజమేనని అన్నాడు. కానీ టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికవడం, సారథిగా పగ్గాలు అందుకోవడం, జట్టును సమర్థంగా నడిపించడం తన జీవితంలో అత్యంత గొప్ప విషయాలని విరాట్ షేర్ చేశాడు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. శుబ్‌మన్ గిల్ కూడా సరిగ్గా ఇదే విషయం చెప్పాడు. టెస్ట్ కెప్టెన్సీ చాన్స్ రావడం తన లైఫ్‌లో గొప్ప విషయమని నాతో చెప్పాడు’ అని దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ స్థాయిలో..
కోహ్లీ-గిల్ సారథ్య పద్ధతులు వేరు కావొచ్చు.. కానీ కెప్టెన్సీని వాళ్లు చూసే విధానం మాత్రం ఒకటేనని కార్తీక్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ పరంగానూ గిల్‌లో అపారమైన ప్రతిభ, నైపుణ్యం ఉన్నాయని తెలిపాడు. ఇప్పుడు మానసికంగానూ సారథి ఎలాంటి దృక్పథంతో ఉండాలో అది అతడు అలవర్చుకుంటున్నాడని కార్తీక్ మెచ్చుకున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కోహ్లీ అడుగుజాడల్లో గిల్ నడుస్తున్నాడని.. విరాట్‌లాగే శుబ్‌మన్ కూడా భారీ విజయాలు సాధిస్తాడనే నమ్మకం ఉందన్నాడు.
ఇవీ చదవండి:
నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి