Varun Chakravarthy: వరుణ్ మ్యాజికల్ డెలివరీ.. దీన్ని ఆడే మొనగాడే లేడు
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:03 PM
India Vs New Zealand Final: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. మ్యాజికల్ డెలివరీస్‌తో కివీస్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు.

అదే మ్యాజిక్, అదే మిస్టరీ, అదే జోరు.. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆగలేదు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వరుణ్ రఫ్ఫాడించాడు. ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన వరుణ్.. ఆఖరాటలోనూ అదే టెంపోను మెయింటెయిన్ చేశాడు. 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చుకొని 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ విల్ యంగ్ (15)తో పాటు జోరు మీదున్న గ్లెన్ ఫిలిప్స్ (34)ను అతడు పెవిలియన్‌కు పంపించాడు. అయితే రెండు వికెట్లలో ఫిలిప్స్‌ది మాత్రం చాలా స్పెషల్ వికెట్ అనే చెప్పాలి.
స్టంప్స్ చెల్లాచెదురు
కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిలిప్స్ వికెట్ కీలకంగా చెప్పాలి. 2 బౌండరీలు, ఒక సిక్స్‌తో కాక మీదున్న ఈ పించ్ హిట్టర్.. మరికొన్ని ఓవర్లు ఆడి ఉంటే న్యూజిలాండ్ మరింత భారీ స్కోరు చేసేది. కీలక సమయంలో బౌలింగ్‌కు దిగిన వరుణ్.. అతడికి పెవిలియన్ దారి చూపించాడు. గూగ్లీ వేసిన మిస్టరీ స్పిన్నర్.. ఫిలిప్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బ్యాటర్‌కు చేరువలో పడిన బంతి.. కింద పడిన వెంటనే షార్ప్ టర్న్ అయి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. ఫిలిప్స్ షాట్ కొట్టినా.. అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లి స్టంప్స్‌ను చెల్లాచెదురు చేసింది. దీంతో కివీస్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇదేం డెలివరీ అంటూ గుడ్లు తేలేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఇప్పుడు 5.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 31 పరుగులతో ఉంది. రోహిత్‌తో పాటు గిల్ క్రీజులో ఉన్నాడు.
ఇవీ చదవండి:
టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా..
గర్ల్‌ఫ్రెండ్‌తో చాహల్.. అందరి ముందే..
రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి