Share News

Rohit vs Surya: రోహిత్‌తో ఆడుకున్న సూర్యకుమార్.. భలే ఏడిపించాడుగా

ABN , Publish Date - Apr 22 , 2025 | 08:51 PM

IPL 2025: రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్‌కు మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్విరాన్‌మెంట్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.

Rohit vs Surya: రోహిత్‌తో ఆడుకున్న సూర్యకుమార్.. భలే ఏడిపించాడుగా
Rohit-Surya

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో హిట్‌మ్యాన్‌ను ఏడిపిస్తూ కనిపించాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. ఇలాగేనా జుట్టు సవరించుకునేది అంటూ రోహిత్‌ను టీజ్ చేశాడు సూర్య. ఏంది రా బాబు ఇదంటూ అక్కడి నుంచి వెళ్లబోయాడు హిట్‌మ్యాన్. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అసలు.. రోహిత్-సూర్య మధ్య ఏం జరిగింది.. హిట్‌మ్యాన్‌తో మిస్టర్ 360 ఎలా ఆడుకున్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..


రోహిత్‌ను కాపీ చేస్తూ..

ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు రోహిత్-సూర్యకుమార్. ఇందులో భాగంగా తల జట్టును సవరించుకుంటూ నవ్వాలి. అయితే రోహిత్ మాత్రం ముందు హెయిర్ సెట్ చేసుకొని, ఆ తర్వాత నవ్వాడు. దీంతో అలా కాదంటూ హిట్‌మ్యాన్‌తో ఎలా యాక్ట్ చేయాలో షూట్ టీమ్ చెప్పింది. ఇదంతా చూస్తున్న స్కై.. రోహిత్ జుట్టు సవరించే పోజును కాపీ చేస్తూ వెక్కిరించాడు. దీంతో తప్పించుకోబోయిన హిట్‌‌మ్యాన్.. మళ్లీ యాక్టింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈసారి స్టైలిష్‌గా తలను సవరిస్తూ క్యూట్ స్మైల్ ఇచ్చాడు. దీంతో షూట్ టీమ్ సూపర్ సార్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తగా.. సూర్యకుమార్ నవ్వుల్లో మునిగిపోయాడు. కాగా, వీళ్లిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్‌లో అదరగొడుతోంది. 8 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది ముంబై. ఇంకో నాలుగు విజయాలు సాధిస్తే ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.


ఇవీ చదవండి:

దూబె గొప్ప మనసు.. వాళ్ల కోసం ఏకంగా..

అది పచ్చి అబద్ధం: ధోని

రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2025 | 08:51 PM