Rohit Sharma: ఒక్క వన్డే ఆడకుండానే చాంపియన్స్ ట్రోఫీకి.. రోహిత్ ధైర్యానికి సెల్యూట్
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:20 PM
Suresh Raina Praises Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. హిట్‌మ్యాన్ దమ్మున్నోడు అని.. అందుకే అంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడని మెచ్చుకున్నాడు.

Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో ముందుంటాడు. జట్టు గెలుపు కోసం ఏం అవసరమైతే అది చేస్తాడు. కావాలంటే తాను బెంచ్ మీద కూర్చొని యంగ్‌స్టర్స్‌ను ఆడించేందుకు కూడా సిద్ధమవుతాడు. ఇటీవల సిడ్నీ టెస్ట్‌లో ఇదే పని చేశాడు. ఇలా టీమ్ అవసరాలు, మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు హిట్‌మ్యాన్. అలా అతడు తీసుకున్న ఓ డెసిషన్‌ను భారత వెటరన్ బ్యాటర్ సురేష్ రైనా మెచ్చుకున్నాడు. ఎంతో గట్స్ ఉంటే గానీ రోహిత్‌లా చేయలేమని.. ఆ పని చేసినందుకు అతడ్ని ప్రశంసించాల్సిందేనని అన్నాడు. ఇంతకీ రోహిత్ ఏం చేశాడంటే..
పట్టుబట్టి మరీ..!
చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. ఇందులో అనూహ్యంగా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు కూడా చేర్చారు. ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు జైస్వాల్. టెస్టులు, టీ20ల్లో ఆడుతూ వస్తున్నాడీ కుర్ర బ్యాటర్. అయితే ఆ పొజిషన్ కోసం ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా.. విపరీతమైన పోటీ ఉన్నా అతడి టాలెంట్, శ్రమించే తత్వం, గేమ్‌కు త్వరగా అడాప్ట్ అయ్యే తీరు, స్కిల్స్ చూసి చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో జైస్వాల్ ఉండాల్సిందేనని పట్టుబట్టి మరీ రోహిత్ తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఇదే విషయంపై రైనా రియాక్ట్ అయ్యాడు. కుర్ర బ్యాటర్‌కు చాన్స్ ఇవ్వడం గొప్ప విషయమంటూ హిట్‌మ్యాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు ఫెయిలైతే విమర్శలు తప్పవని తెలిసినా.. డేర్ చేసి తీసుకున్నందుకు శభాష్ అంటూ మెచ్చుకున్నాడు.
క్రెడిట్ వాళ్లకే!
‘జైస్వాల్‌కు పరుగుల దాహం ఎక్కువ. రన్స్ చేయాలని అతడు ఆకలితో ఉంటాడు. అతడు ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. జైస్వాల్‌ను చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకున్నందుకు సెలెక్టర్లు, సారథి రోహిత్‌కు హ్యాట్సాఫ్. ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని కుర్రాడికి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకే రోహిత్‌కు క్రెడిట్ దక్కాలి. జైస్వాల్ కళ్లలో ఫైర్ కనిపిస్తూ ఉంటుంది. అతడికి ఓపికా ఎక్కువే. ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం అతడు ప్రిపేర్ అయి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు రోహిత్ లాంటి సూపర్ పవర్ అండగా ఉండటం మంచి విషయం. ప్రతిభకు పెద్దపీట వేయడం శుభపరిణామం’ అని రైనా చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి బౌలర్‌గా రికార్డు
మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11.. విధ్వంసక బ్యాటర్ రీఎంట్రీ
రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి