Heinrich Klaasen Six: క్లాసెన్ పిచ్చకొట్టుడు.. సీజన్‌లోనే భారీ సిక్సర్ బాదేశాడు
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:04 PM
IPL 2025: కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసెన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. సీజన్‌లో ఫస్ట్ టైమ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేసిన క్లాసెన్.. ఓ భారీ సిక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.

స్కోరు బోర్డు మీదకు 2 పరుగులు కూడా చేరకముందే ఫస్ట్ వికెట్ డౌన్. 35 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. ఇక, టీమ్ పనైపోయిందని అనుకుంటున్న తరుణంలో తాను ఉన్నానంటూ నిలబడ్డాడు రియల్ కాటేరమ్మ కొడుకు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు హెడ్, అభిషేక్‌తో పాటు ఇషాన్, నితీష్, అనికేత్ 35 పరుగుల్లోపే ఔట్ అయ్యారు. అయితే కాటేరమ్మ కొడుకు క్లాసెన్ (40 బంతుల్లో 62 నాటౌట్) క్రీజులో అడ్డంగా నిలబడిపోయాడు. భారీ షాట్లతో ముంబైపై విరుచుకుపడ్డాడు. అతడు కొట్టిన ఓ సిక్స్ అయితే ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
వాటే షాట్..
సన్‌రైజర్స్ 100 పరుగులైనా చేస్తుందా అని సందేహిస్తున్న తరుణంలో క్రీజులో పాతుకుపోయాడు క్లాసెన్. అభినవ్ మనోహర్ (28 నాటౌట్) సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. సింగిల్స్, డబుల్స్ కంటే ఫోర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాటేరమ్మ కొడుకు. 8 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ బాదాడు. స్పిన్నర్ పుతుర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా అతడు కొట్టిన ఆ బాల్ ఏకంగా 107 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఈ సీజన్‌లో ఇదే భారీ సిక్స్ కావడం విశేషం. ఇంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ 106 మీటర్ల సిక్స్ బాదాడు. ఇప్పుడు దీన్ని క్లాసెన్ దాటేశాడు. కాగా, ప్రస్తుతం 17.3 ఓవర్లలో 5 వికెట్లకు 117 పరుగులతో ఉంది సన్‌రైజర్స్.
ఇవీ చదవండి:
ఔట్ కాకున్నా వెళ్లిపోయిన ఇషాన్
పహల్గాం అటాక్.. హార్దిక్ సీరియస్..
సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి